ట్రాఫిక్ సీఐపై మహిళ ఫిర్యాదు

13 Dec, 2015 16:07 IST|Sakshi

హైదరాబాద్: ట్రాఫిక్ విభాగంలో సీఐగా పనిచేస్తున్న ఓ వ్యక్తి పై ఆదివారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది.             
ఆనంద్ నగర్లోని ఓ అపార్ట్మెంట్లో నీటి పైప్లైన్ వివాదంలో తల దూర్చిన సీఐ తనపై చేయి చేసుకున్నాడని మహిళ ఆరోపించింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు.


 

మరిన్ని వార్తలు