సిగ్నల్ జంప్‌లో పోటీపడుతున్న మహిళలు

7 Oct, 2015 21:26 IST|Sakshi
సిగ్నల్ జంప్‌లో పోటీపడుతున్న మహిళలు

మారేడుపల్లి: ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద పోలీసులు కనిపించకపోతే సిగ్నల్ జంప్ చేయటం పరిపాటిగా మారింది. ఈ విషయంలో పురుషులతో పోటీగా మహిళలు కూడా పోలీసులకు జరిమానాలు చెల్లించుకుంటున్నారు. సిగ్నల్ జంప్,సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్‌లకు అడ్డుకట్ట వేసేందుకు మారేడుపల్లి ట్రాఫిక్ పోలీసులు రోజూ కాప్ లెస్ జంక్షన్ వద్ద డ్రైవ్ చేపడుతున్నారు. స్వీకార్ ఉప్‌కార్ సిగ్నల్స్ వద్ద రోజూ సీఐ నుంచి ఎస్సై వరకు తనిఖీల్లో పాల్గొని వాహనదారులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తూ జరిమానాలు విధిస్తున్నారు. ఇలా ఇరవై రోజుల్లోనే 500 పైగా కేసులు నమోదు అయ్యాయి.

సిగ్నల్ జంప్, ట్రిపుల్ రైడింగ్, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసేవారికి రూ.వేయి చొప్పున చలానా రాస్తున్నారు. ఇప్పటి వరకు కాప్‌లెస్ జంక్షన్ల వద్ద ఐదు వందల మంది వాహనదారుల నుంచి ఐదు లక్షలకు పైగా వసూలు చేశారు. వాహనదారులు గమ్య స్థానానికి చేరుకోవాలనే ఆత్రుతతో రెడ్ సిగ్నల్ జంప్ చేస్తూ అనేక ప్రమాదాలకు గురవుతున్నారని మారేడుపల్లి ట్రాఫిక్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సిగ్నళ్ల వద్ద పోలీసులు కనిపించని సమయాల్లో వాహనచోదకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. కాప్ లెస్ జంక్షన్ పద్ధతిని మరింత కట్టుదిట్టం చేస్తామన్నారు. పోలీసులు గమనించరనే భ్రమతో మహిళలు కూడా ఎక్కవగా సిగ్నల్ జంప్ చేస్తున్నార ని ఆయన వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు