విమెన్స్ పోయెట్రీ ఇన్ ఉర్దూ

25 Jan, 2015 23:52 IST|Sakshi
విమెన్స్ పోయెట్రీ ఇన్ ఉర్దూ

హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌లో ఆదివారం ఆకట్టుకున్న అంశం ‘విమెన్స్ పొయెట్రీ ఇన్ ఉర్దూ’. 1940ల్లో హైదరాబాద్ ఉర్దూ సాహిత్యంలో మహిళల కంట్రిబ్యూషన్ సాటిలేనిది. డెబ్బైల వరకూ అంతే ఉత్సాహంగా సాగిన స్త్రీ కలం తర్వాత ఎంతో నిర్లక్ష్యానికి గురైంది. ‘ఆ పరిస్థితికి గల కారణాలతో పాటు మహిళా ఉద్యమాలు, ఉర్దూ సాహిత్యంలో మహిళా కవయిత్రులు, రాజకీయాల్లో మహిళలు వంటి అనేక అంశాల మీద చర్చ సాగింది. కవయిత్రులు అష్రాఫ్ రఫీ, ఫాతిమా తాజ్, మనీషా, బంగార్, షాఫిఖ్ ఫాతిమా షేరాల షాయరీలు ఆహూతులను ఆకట్టుకున్నాయి’ అని చెప్పారు నిర్వాహకురాలు జమీలా నిషాత్.

1940ల్లో హైదరాబాద్ ఉర్దూ సాహిత్యంతో ముడిపడి ఉన్న పేరు సొహ్రా హుమాయున్ మిర్జా. సరోజినీనాయుడికి అత్యంత సన్నిహితురాలైన సొహ్రా సాహిత్యంలోనే కాదు స్వాతంత్య్ర సమరంలో, స్త్రీ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న వనిత. అప్పట్లో గాంధీజీ సమావేశాలకు ఆమే నిర్వాహకురాలు.‘బజ్మె హవాతి దక్కన్’ అనే మహిళా సంస్థను స్థాపించి ఉర్దూ సాహిత్యంలో స్త్రీలను ప్రోత్సహించారు. స్త్రీవిద్య కోసం పాటుపడ్డారు. ఆమె స్థాపించిన ‘సబ్దరియా’ అనే బడి ఇప్పటికీ మెహిదీపట్నంలో నడుస్తోంది.

మరిన్ని వార్తలు