మండలిలో ఈటల వర్డ్స్‌ వార్

20 Mar, 2016 10:57 IST|Sakshi

హైదరాబాద్: గత ప్రభుత్వాలు చేసిన తప్పదాలను, నిర్లక్ష్యాన్ని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ ఎండగట్టారు. తన వాగ్దాటితో ప్రతిపక్షాలను నోరుమెదపకుండా చేశారు. నేటి తెలంగాణ రాజకీయ వ్యవస్థకు ఒక స్పష్టమైన విజన్ ఉందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలకు దేశ వ్యాప్తంగా గుర్తింపు వస్తోందని, మిషన్ భగీరథ వంటి పథకాలు పొరుగు రాష్ట్రాలు అనుసరించేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు.

బడ్జెట్లో అంచనాలు ఉంటాయే తప్ప ఓ ప్రైవేటు సంస్థ పద్దుల పుస్తకంలా ఉండదని చెప్పారు. శాసనమండలిలో ఆయన ఆదివారం బడ్జెట్ చర్చపై వివరణ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం సంక్షేమ రాష్ట్రం అన్నారు. పారిశ్రామిక రంగంలో వృద్ధి సాధిస్తున్నామని చెప్పారు. లక్షా 25వేలమందికి ఉచితంగా పట్టాలు ఇచ్చామని చెప్పారు. అన్యాక్రాంత భూములను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. తెలంగాణ వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల దయనీయ స్థితిగతులను వివరించిన ఈటల వారి తలరాత మార్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. సన్న బియ్యం కోసం 700కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. చట్టాలనేవి దేవుడు చేసినవి కాదని ప్రజల సంక్షేమం కోసం వాటిని మార్చుకోవచ్చని చెప్పారు.

>
మరిన్ని వార్తలు