పని ఒత్తిడి, సిబ్బంది కొరత - సీబీఐ

23 Dec, 2016 23:14 IST|Sakshi
పని ఒత్తిడి, సిబ్బంది కొరత - సీబీఐ


కేసుల విచారణపై హైకోర్టుకు నివేదించిన సీబీఐ

హైదరాబాద్‌: హై ప్రొఫైల్‌ కేసులు, ఆదాయానికి మించిన ఆస్తులు, అవినీతి, బ్యాంకులకు టోకరా.. ఇలా అనేక కేసుల విచారణలతో పని ఒత్తిడి ఎదుర్కొంటున్నామని ఉమ్మడి హైకోర్టుకు సీబీఐ నివేదించింది. ఉన్నత న్యాయస్థానాల ఆదేశాలపై అనేక కేసులు దర్యాప్తు చేస్తున్నామని, సిబ్బంది కొరత ఉందని వివరించిం ది. తమ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరింది.

వక్ఫ్‌ ఆస్తుల ఆక్రమణలు, బదలాయింపులపై సీబీఐ దర్యా ప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో రాష్ట్ర మైనారిటీ కమిషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐలకు నోటీసులు జారీ చేసి, కౌంటర్ల దాఖలుకు ఆదేశించింది. దీనిపై సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసింది.

మరిన్ని వార్తలు