కార్మికులకు వడదెబ్బ తగలకుండా చూడాలి

15 Apr, 2016 03:49 IST|Sakshi

ఎన్‌ఎంయూ
సాక్షి, హైదరాబాద్: ఎండ తీవ్రతకు వడదెబ్బ మృతుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మండే ఎండల్లో బస్సులు నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లపై ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించాలని టీఎస్‌ఆర్టీసీ ఎన్‌ఎంయూ పేర్కొంది.  పగలు విధుల్లో ఉండే కార్మికుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు కూడా పేర్కొన్న నేపథ్యంలో డ్రైవర్లు, కండక్టర్ల కోసం నీళ్లు, మజ్జిగ, గ్లూకోజ్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని కోరింది. హైదరాబాద్‌లో ప్రధాన పాయింట్లలో వైద్యులను కూడా అందుబాటులో ఉంచాలని సంఘం ప్రతినిధులు నాగేశ్వరరావు, లక్ష్మణ్, మౌలానా గురువారం ఓ ప్రకటనలో కోరారు. లేని పక్షంలో హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.

>
మరిన్ని వార్తలు