'భత్కల్ 27 సార్లు మాట్లాడాడు'

4 Jul, 2015 16:18 IST|Sakshi
'భత్కల్ 27 సార్లు మాట్లాడాడు'

యాసిన్ భత్కల్ మొత్తం 27 సార్లు ఫోన్లో మాట్లాడాడని జైళ్ల శాఖ డీఐజీ నరసింహ తెలిపారు. భత్కల్ తన భార్యతో మాట్లాడిన అంశాలు బహిర్గతం అయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. భత్కల్ వద్ద సెల్ఫోన్ ఉందన్న మాట అవాస్తవమని చెప్పారు. అతడు తన తల్లితోను, భార్యతోను జైలు ఫోన్ నుంచే మాట్లాడాడన్నారు. నిబంధనల ప్రకారం భత్కల్ మాట్లాడిన ప్రతి కాల్ను రికార్డు చేశామని తెలిపారు. జైలులో ఉన్న ఖైదీలందరికీ ల్యాండ్ లైన్ అందుబాటులో ఉంటుందని ఆయన చెప్పారు.

ఆ ఫోను వాడుకోడానికి కూడా మొదట్లో తాము భత్కల్కు అనుమతి ఇవ్వలేదని.. తర్వాత కోర్టు ఆదేశాల మేరకు వారంలో రెండుసార్లు ఫోన్ మాట్లాడుకునేందుకు అనుమతి ఇచ్చామన్నారు. అది కూడా ఒక్కోసారి 5 నిమిషాలు మాట్లాడేందుకు మాత్రమే అనుమతి ఉందని తెలిపారు. భత్కల్ మొత్తం 27 సార్లు మాట్లాడాడని వివరించారు. అతడు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడన్న సమాచారాన్ని ఎన్ఐఏ తమకు ఇవ్వలేదని డీఐజీ నరసింహ చెప్పారు. అయితే తాజాగా వెల్లడైన అంశాల నేపథ్యంలో చర్లపల్లి జైలుకు అదనపు భద్రత కల్పిస్తున్నామని ఆయన అన్నారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు