ప్రేమించలేదని బాలికపై గ్యాంగ్ రేప్!

11 Apr, 2014 17:30 IST|Sakshi

హైదరాబాద్‌: పాతబస్తీలో 14ఏళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్‌ జరిగింది. బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన మహబూబ్‌ అనే యువకుడు హఫీజ్‌బాబానగర్‌లోని తన ఇంట్లో నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. స్నేహితులైన షకీల్‌, ఇక్బాల్‌, బషీర్‌లతో కలిసి వారంరోజులపాటు అత్యాచారం చేసి బాలికను శారీరకంగా హింసించారు. అత్యాచారం చేసినట్లు ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించారు. అనంతరం బాలికను బాలానగర్‌లోని ఆమె బంధువుల ఇంటి దగ్గర వదిలి పరారయ్యారు. బాలిక ఇంట్లోకి వెళ్లకముందే షాద్‌నగర్‌కు చెందిన మరో ముగ్గురు వ్యక్తులు ఆమెపై అఘాయిత్యం చేశారు.

 

కూతురు ఆచూకీ తెలియక కంగారుపడిన తల్లిదండ్రులు.. విషయం తెలుసుకుని చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. వైద్యచికిత్స నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు.
 

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు