'రెవిన్యూ పెరగకపోవడానికి కారణం దోపిడీనే'

30 Mar, 2016 11:20 IST|Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇసుక దోపిడీపై బుధవారం వాడివేడి చర్చ జరిగింది. గతంతో పోల్చితే ప్రభుత్వం ఇసుక చార్జీలను పెంచినప్పటికీ రెవిన్యూ పెరగలేదంటే.. దానికి కారణం అధికార పార్టీ దోపిడియే అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇసుక దోపిడీపై ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చర్య తీసుకుంది, ఎవరిని పట్టుకున్నారు అని ఆయన ప్రశ్నించారు.

ఇసుక వ్యవహారంలో 2000 కోట్ల అవినీతి చోటు చేసుకుందని స్వయానా రాష్ట్ర మంత్రి యనమల రామకృష్ణుడు సభలో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా వైఎస్ జగన్ గుర్తు చేశారు. రెండేళ్లు అందినకాడికి ఇసుకను దోచేశారన్నారు. దోపిడీకి పాల్పడిన వారిలో అధికార పార్టీ నాయకులు, చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు ఉన్నారని వైఎస్ జగన్ ఆరోపించారు.
 

మరిన్ని వార్తలు