అమ్మ మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలి

20 Apr, 2016 03:33 IST|Sakshi
అమ్మ మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలి

మాతృమూర్తికి వైఎస్ జగన్ శుభాకాంక్షలు
 
 సాక్షి, హైదరాబాద్ : తన తల్లి వైఎస్ విజయమ్మ మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని  ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మనసారా ఆకాంక్షించారు. మంగళవారం జగన్ నివాసంలో విజయమ్మ 60వ జన్మదిన వేడుకలను నిరాడంబరంగా జరుపుకున్నారు. జగన్ తన తల్లికి కేక్ తినిపించి, మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలంటూ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా జగన్‌ను విజయమ్మ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముద్దాడి తన ఆశీస్సులు అందజేశారు. ‘మా అమ్మ 60వ పుట్టిన రోజును ఇలా జరుపుకున్నాం’ అంటూ తన తల్లితో కలసి దిగిన ఫొటోలను జగన్ తన ట్వీటర్ పేజీలో పోస్ట్ చేశారు.
 

మరిన్ని వార్తలు