అమ్మ పుట్టినరోజున ఇలా..

19 Apr, 2016 14:37 IST|Sakshi
అమ్మ పుట్టినరోజున ఇలా..

హైదరాబాద్: తన తల్లి వైఎస్ విజయమ్మ 60వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. విజయమ్మ జన్మదిన వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. తన తల్లికి కేక్ తినిపించి వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆమె మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ ను అప్యాయంగా ముద్దాడి విజయమ్మ ఆశీస్సులు అందజేశారు. 'మా అమ్మ 60వ పుట్టినరోజు ఇలా జరుపుకున్నాం' అంటూ తన తల్లితో కలిసి దిగిన ఫొటోలను వైఎస్ జగన్ తన ట్విటర్ పేజీలో పోస్ట్ చేశారు.

మరిన్ని వార్తలు