హోదా వస్తేనే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్..

1 Sep, 2015 16:51 IST|Sakshi

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వస్తే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శాసనసభా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం అసెంబ్లీలో ప్రత్యేక హోదాపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాకు పార్లమెంట్లో చట్టం చేయాల్సిన అవసరం లేదు. కేబినెట్ ఆమోదంతో ప్రత్యేక హోదా ఇవ్వొచ్చు. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాఖండ్కు కేబినెట్ ఆమోదంతోనే ప్రత్యేక హోదా ఇచ్చారు. ప్రత్యేక హోదా లేకపోతే ప్యాకేజీ రానేరాదు.

ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలకు రాయితీలు వస్తాయి. హోదా వల్లే ఉత్తరాఖండ్కు 2వేల కొత్త కంపెనీలు, రూ.33 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. హోదా ఉంటేనే హంద్రీనీవా, గాలేరు-నగరి, వెలుగొండ ప్రాజెక్టులకు నిధులను 90 శాతం కేంద్రం భరిస్తుంది.  14వ ఆర్థిక సంఘానికి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పే హక్కు లేదు. హోదా వస్తే పరిశ్రమలకు 10ఏళ్ల పాటు సెంట్రల్ ఎక్సైజ్ రాయితీ, ఐదేళ్లపాటు ఇన్కం ట్యాక్స్ రాయితీ, మరో 5ఏళ్ల పాటు 70 శాతం రాయితీ వస్తాయి. నెల రోజుల్లో హోదా ఇవ్వకపోతే కేంద్ర పదవుల నుంచి తప్పుకుంటామనే ధైర్యం ఉందా?' అని సూటిగా ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు