పేదల కోసం తపించిన వ్యక్తి అంబేడ్కర్

29 Mar, 2016 17:50 IST|Sakshi

హైదరాబాద్: పేదవారి జీవితాలను మార్చడానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఎంతో కృషి చేశారని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఏపీ అసెంబ్లీలో బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి కార్యక్రమం చర్చలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పేదల కోసం తపించిన వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు. సభలో వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..

  • దళిత క్రిస్టియన్లకు ఇంకా ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వకపోవడం దారుణం
  • అలాంటి ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం
  • 2015-16లో ఎస్సీల సంక్షేమానికి ప్రభుత్వం రూ. 4500 కోట్లు ఖర్చు చేసింది
  • ఎస్టీల సంక్షేమానికి కేవలం రూ.1270 కోట్లు ఖర్చు చేశారు
  • ఉపాధి హామీ పథకం నిధులను ప్రభుత్వం ఇతర పనులకు మళ్లిస్తోంది
  • రాష్ట్రంలో 83 లక్షలా 29 వేల 881 కుటుంబాలు ఉంటే.. కోటి 76లక్షల మందిని ఉపాధి కూలీ కోసం నమోదు చేసుకున్నారు
  • కానీ ప్రభుత్వం 58 లక్షల మందికే ఉపాధి కల్పిస్తోంది
  • ఉపాధి హామీలో లేబర్ కాంపోనెంట్ తగ్గించి ఆ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం స్వప్రయోజనాల కోసం వాడుకుంటోంది.
  • కేంద్రంలో మీరు మద్దతు ఇస్తున్న ప్రభుత్వమే ఉంది. లేబర్ కాంపోనెంట్ను వంద శాతానికి పెంచండి
  • ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్సీల గురించి మాట్లాడటం దురదృష్టకరం
  • ట్రైబల్ అడ్వైజరీ కమిటీని ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు
  • ఏడుగురు ఎస్టీ ఎమ్మెల్యేలలో ఆరుగురు వైఎస్ఆర్ సీపీ నుంచి గెలిచారనే కారణంతో ఈ కమిటీ వేయలేదు
  • అంబేడ్కర్ స్ఫూర్తిని ప్రభుత్వం ఎక్కడ అమలు చేస్తోంది?

మరిన్ని వార్తలు