ఐకమత్యాన్ని పెంచే రంజాన్‌ మాసం

28 May, 2017 02:49 IST|Sakshi
ఐకమత్యాన్ని పెంచే రంజాన్‌ మాసం

తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్‌ : ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్‌ నెల ప్రారంభమైన సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో ఐకమత్యం, సామరస్యాన్ని రంజాన్‌ మాసం పెంపొందిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఈ పవిత్ర దినాల్లో ముస్లింలంతా ఉపవాసాలతో ప్రశాంతంగా గడపాలని, అల్లా వారికి సుఖశాంతులు ప్రసాదించాలని ఆకాంక్షించారు. సాటివారికి చేయూతనందించాలనే రంజాన్‌ సారాంశం మరింతగా వర్థిల్లాలని అన్నారు. మనిషిలో క్రమశిక్షణ, ఐక్యత, సర్వమానవ సౌభ్రాతృత్వం, సహనశీలత, మనో నిశ్చలత, దాన గుణాన్ని పెంపొందించే మహత్తరమైన నెల రంజాన్‌ అని జగన్‌ పేర్కొన్నారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు