'నాన్న బతికుంటే మెట్రో ఎప్పుడో పూర్తయ్యేది'

5 Jan, 2016 17:02 IST|Sakshi
'నాన్న బతికుంటే మెట్రో ఎప్పుడో పూర్తయ్యేది'

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర మంగళవారం కొనసాగుతోంది. హైదరాబాద్ను గ్రేటర్ నగరంగా అభివృద్ధి చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని వైఎస్ షర్మిల అన్నారు. దేశంలోనే అతి పెద్ద ఔటర్ రింగ్, అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి చేసింది వైఎస్ఆరే అని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. నాన్న బతికుంటే మెట్రో రైలు ఎప్పుడో పూర్తయ్యేదని వైఎస్ షర్మిల అన్నారు. కృష్ణా, గోదావరి జలాలతో హైదరాబాద్ దాహార్తి తీర్చారన్నారు. ముస్లింలకు రిజర్వేషన్ కల్పించింది వైఎస్ఆరే అని పునరుద్ఘాటించారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ప్రజల గుండెల్లో వైఎస్ ఆర్ ఉంటారని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

కాగా అంతకు ముందు తారానగర్‌ తుల్జాభవన్‌ దేవాలయం సమీపంలోని దిగంబరరావు కుటుంబసభ్యులను పరామర్శించిన తర్వాత షర్మిల.. కూకట్‌పల్లి అల్విన్‌కాలనీ ఫస్ట్‌ ఫేస్‌ చౌరస్తాలోని సన్నిధి కృష్ణ ఇంటికి వెళ్లారు. నేనున్నానని భరోసా కల్పించారు. అల్విన్‌కాలనీలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత కూకట్‌పల్లి రామాలయం సమీపంలోని టీ రణతేజ ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. రాజన్న కుటుంబం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. 

అక్కడి నుంచి మూసాపేట గాంధీ చౌరస్తాలో సమీపంలోని నోముల రాజయ్య కుటుంబాన్ని కలిశారు. కుటుంబ సభ్యుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం షాపూర్‌నగర్‌ చౌరస్తాలో వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళుర్పించారు. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించారు.

మరిన్ని వార్తలు