10% తగ్గిన హెచ్‌1బీ వీసాలు

6 Jun, 2019 04:13 IST|Sakshi

అమెరికా అధ్యక్షుడు  ట్రంప్‌ అనుసరిస్తున్న కఠినమైన వలస విధానం దెబ్బ హెచ్‌–1బీ వీసాల జారీపై గణనీయమైన ప్రభావం చూపిస్తోంది. అత్యంత నైపుణ్యం కలిగిన భారత్, ఇతర విదేశీ ఐటీ నిపుణులకు అమెరికాలో ఉద్యోగానికి వీలు కల్పించే ఈ  వీసాల జారీ బాగా తగ్గిపోయింది. అంతకుమందు ఏడాదితో పోలిస్తే 2018 ఆర్థిక సంవత్సరంలో 10 శాతం మేర తగ్గింది. అమెరికా పౌరసత్వ, వలస సర్వీసుల సంస్థ (యూఎస్‌సీఐఎస్‌) 2018లో కొత్త వీసాలు, రెన్యువల్స్‌ కలిపి మొత్తం 3,35,000 హెచ్‌1బీలపై ఆమోద ముద్ర వేసింది. 2017లో 3,73,400 వీసాలిచ్చారు. 

2017లో ప్రతి 100 దరఖాస్తులకు 93 వీసాలు మంజూరైతే, 2018లో ప్రతి 100 దరఖాస్తులకు 85 వీసాలు మంజూరయ్యాయి. అమెరికాలో విదేశీ వర్కర్లు పని చెయ్యాలంటే హెచ్‌1బీ వీసా తప్పనిసరి. హెచ్‌1 బీ వీసా నిబం«ధనల్ని అతిక్రమించే సంస్థల చుట్టూ ట్రంప్‌ ఉచ్చు బిగించారు. అమెరికా పౌరులకు ఉద్యోగాలు నిరాకరించే ఐటీ కంపెనీలపై ట్రంప్‌ గుర్రుగా ఉన్నారు. అమెరికా వర్కర్లకు అత్యధికంగా వేతనాలు చెల్లించేలా, వారికి ఆర్థిక భరోసా కల్పించేలా నిబంధనల్ని మార్చేశారు. దీంతో వీసాల సంఖ్య తగ్గిపోయింది.

మరిన్ని వార్తలు