టర్కీలో ఆత్మాహుతి దాడి; 10మంది మృతి

20 Jul, 2015 17:12 IST|Sakshi

టర్కీ: టర్కీలో ఉగ్రవాదులు నరమేధానికి తెగబడ్డారు. ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 10 మృతిచెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడు ఘటన సురుక్ ప్రాంతంలోని ఇరాక్ సరిహద్దుకు సమీపాన టర్కీ శాన్లిర్ఫా ప్రొవిన్స్ వద్ద  చోటుచేసుకున్నట్టు అక్కడి ఓ మీడియా నివేదించింది. ఈ ఘటన జరిగిన సమయంలో 300 మంది సోషలిస్ట్ యూత్ అసోసియేషన్ ఫెడరేషన్ సభ్యులు అమరా కల్చర్ సెంటర్ వద్ద పనిచేస్తున్నట్టు తెలిసింది. వీరంతా వేసవి సాహస యాత్రలో భాగంగా కోబేన్ పుననిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా బాంబు పేలుడు సంభవించిందని హుర్రిట్ డైయిలీ న్యూస్ వెల్లడించింది.

ఈ పేలుడులో తీవ్రంగా గాయపడిన వారికి రక్తం అవసరమని, రక్త దాతల సహాయం అత్యవసరమని ఈ ఘటనను చూసిన ప్రత్యక్షసాక్షి ఒకరు పేర్కొన్నారు. అయితే పిపుల్స్ డెమెక్రటిక్ పార్టీ (హెచ్డీపీ) కార్యకలాపాలు సురక్ మున్సిపాలిటీ పర్యవేక్షణలో ఉంది. ఇక్కడ జర్నలిస్టులు, వాలంటీలర్లు తరుచూ వచ్చిపొతుంటారు. అయితే ఈ బాంబు పేలుడుకు ఉగ్రవాదులు కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జరిగిన ఘటన పరిశీలిస్తే ఆత్ముహుతి దాడికి పాల్పడిన వ్యక్తి అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్థాలతో ఈ నరమేధానికి తెగపడినట్టు ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు