ఫోన్ బ్యాటరీల నుంచి100 విషవాయువులు

22 Oct, 2016 01:31 IST|Sakshi
ఫోన్ బ్యాటరీల నుంచి100 విషవాయువులు

వాషింగ్టన్: స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు వంటి వాటిలోని బ్యాటరీల నుంచి 100 రకాలకు పైగా ప్రాణాంతక విష వాయువులు వెలువడుతున్నట్లు అధ్యయనంలో తేలింది. లిథియం అయాన్  బ్యాటరీల నుంచి కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువులు వెలువడుతున్నాయని, వీటి వల్ల చర్మ,శ్వాస రోగాలు వచ్చే ప్రమాదముందని, పర్యావరణానికి నష్టం జరుగుతుందని ఎన్‌బీసీ డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్(అమెరికా), చైనాలోని సింఘువా వర్సిటీ(చైనా) పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.  ఏడాదికి 200 కోట్ల చొప్పున వినియోగంలోకి వస్తున్న లిథియం-ఇయాన్ బ్యాటరీలపై పరిశోధన జరిపారు.

మరిన్ని వార్తలు