టైమ్ స్క్వేర్స్ వద్ద 11 వేలమందితో యోగా

22 Jun, 2014 18:58 IST|Sakshi

న్యూయార్క్: భారతీయ జీవన విధానంలో భాగమైన యోగాకు ఖండాంతరాలలోనూ ప్రాచుర్యం లభిస్తోంది. న్యూయార్క్ నగరంలో నిత్యం రద్దీగా టైమ్ స్క్వేర్లో 11 వేలమందికిపైగా యోగా చేశారు. శనివారం క్రాస్ రోడ్స్ వద్ద చాపలు వేసుకుని ఆసనాలు చేశారు.

ఈ కార్యక్రమం చేయడం సాహసమని టైమ్స్ స్క్వేర్ అలియెన్స్ అధ్యక్షుడు టిమ్ టాంప్కిన్స్ అన్నారు. యోగా ప్రక్రియలో సూర్యుడిని ఆరాధించే దినమని 25 ఏళ్ల యోగా శిక్షకురాలు క్రిస్టీనా కీలుస్నియక్ అన్నారు. న్యూయార్క్ నగరంలో టైమ్స్ స్క్వేర్ అతిపెద్ద వాణిజ్య సముదాయం.

మరిన్ని వార్తలు