అమెరికా అధ్యక్షుడినవుతా

23 May, 2015 15:45 IST|Sakshi
అమెరికా అధ్యక్షుడినవుతా

లాస్ ఏంజెల్స్: భారతీయ సంతతికి చెందిన అమెరికా బాలుడు 11 ఏళ్లకే డిగ్రీ పట్టా పుచ్చుకుని పలువురిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. కాలిఫోర్నియాలోని అమెరికన్ రివర్ కాలేజీలో మూడు వరుస డిగ్రీలతో సంలచనం సృష్టించాడు. అమెరికాలో అతి చిన్న వయసులో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన విద్యార్థిగా తనిష్క్ అబ్రహాం   రికార్డు కొట్టేశాడు. ఏకంగా మూడు విభాగాల్లో.. మాథ్స్, సైన్స్, విదేశీ భాషల్లో  డిగ్రీలు సాధించాడు. 1800  విద్యార్థుల్లో హాజరైన ఈ సంవత్సరం పరీక్షల్లో తనిష్క్ ఈ ఘనతను సాధించాడు.

తనిష్క్ ఏడేళ్ల వయిసులో హైస్కూలు డిప్లొమా సాధించి అమెరికా అధ్యక్షుడు ఒబామా నుంచి ప్రశంసలందుకున్నాడు. తనిష్క్ను అభినందిస్తూ ఆయన ఒక లేఖ కూడా రాశారు. తనిష్క్ చాలా తెలివైనవాడు... క్లాస్లో ఎప్పుడూ తనే ఫస్ట్...ఇది ఏమంత పెద్ద విజయం కాదు..తను సాధించాల్సింది ఇంకా ఉంది అంటున్నారు  తల్లి తాజి అబ్రహాం.

అన్నట్టు ఈ బుడతడు డాక్టర్ కావాలనుకుంటున్నాడట... వైద్యరంగంలో పరిశోధనలు చేయాలనుకుంటున్నాడట.. అంతేనా.. అమెరికా అధ్యక్షుడు కావాలనుకుంటున్నాడట. నాకు నేర్చుకోవడం అంటే ఇష్టం.  ఆ అలవాటే నన్ను ఇక్కడ నిలబెట్టిందని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు తనిష్క్. దీంతో.. హార్నీ.. పిడుగా. ఏకంగా ఒబామాకే ఎసరు పెట్టేశాడుగా అని చమత్కరిస్తున్నారు కొంతమంది పెద్దలు!

 

మరిన్ని వార్తలు