పాకిస్తాన్‌లో ప్రారంభమైన ఎన్నికల పోలింగ్‌

25 Jul, 2018 09:25 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో 11వ జాతీయ అసెంబ్లీ(పార్లమెంట్‌) ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్‌ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలవుతుంది. కేవలం 24 గంటల సమయంలోనే రాజకీయ పార్టీల భవితవ్యం తేలనుంది. మొత్తం 272 జాతీయ అసెంబ్లీ స్థానాలతో సహా పంజాబ్‌, సింధ్‌, బలూచీస్తాన్‌, ఖైబర్‌ ఫక్తున్‌క్వా రాష్ట్రాల్లోని  577 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపు పదికోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవటానికి 85వేల పోలింగ్‌ బూత్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇమ్రాన్‌ ఖాన్‌ ‘పాకిస్తాన్‌ తెహ్రీక్‌–ఇ–ఇన్సాఫ్‌’ (పీటీఐ), నవాజ్‌ షరీష్‌ పాకిస్తాన్‌ ‘‘ముస్లిం లీగ్‌-నవాజ్‌’’  (పీఎంఎల్‌-ఎన్‌)ల మధ్యే ప్రధానంగా పోటీ నడుస్తోంది. పోలింగ్‌ బూత్‌ల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 4 లక్షల మంది పోలీసులు, 3,71,388 మంది సైనికులను మోహరించారు.

మరిన్ని వార్తలు