సౌదీ డెడ్‌లైన్‌.. 12000 మంది వెనక్కి!

26 Apr, 2017 11:39 IST|Sakshi
సౌదీ డెడ్‌లైన్‌.. 12000 మంది వెనక్కి!

ఢాకా: దేశంలోని అక్రమ వలసదారులపై సౌదీ అరేబియా ప్రభుత్వం కొరడా ఝులిపిస్తోంది. జూన్‌ 30 వరకు అక్రమ వలసదారులు తమ దేశాలకు తిరిగివెళ్లాలని డెడ్‌లైన్‌ విధించింది. దీంతో సుమారు 12,000 మంది బంగ్లాదేశీ అక్రమ వలసదారులు స్వదేశానికి పయనమయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రియాద్‌, జెడ్డాలలో ఇప్పటికే 11 వేల మంది బంగ్లాదేశీయులు ఔట్‌పాస్‌ను తీసుకున్నారని బంగ్లాదేశ్‌ ఎంబసీ వెల్లడించింది.

డెడ్‌లైన్‌ లోగా దేశాన్ని విడిచిపెట్టని వారికి జైలు శిక్షతో పాటు ఫైన్‌ విధించనున్నట్లు సౌదీ ప్రకటించింది. దీనికోసం కొన్ని కొత్త జైళ్లను సైతం సిద్ధం చేస్తోంది. గడువులోగా 'జనరల్‌ పార్డన్‌' కింద వెళ్లే అక్రమ వలసదారులు కావాలంటే చట్టబద్ధంగా తిరిగి దేశంలోకి అడుగుపెట్టడానికి సౌదీ అవకాశం కల్పించింది. వీసా గడువు ముగిసిన తరువాత కూడా దేశంలో ఉంటున్న వారిని టార్గెట్‌గా చేసుకొని చేపడుతున్న డ్రైవ్‌లో.. సుమారు 10 లక్షల మందిని దేశంనుంచి పంపించాలని సౌదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

మరిన్ని వార్తలు