పుష్కరంలోకి ఫేస్బుక్

4 Feb, 2016 19:02 IST|Sakshi
పుష్కరంలోకి ఫేస్బుక్

ప్రపంచం మొత్తాన్ని ఒకే గొడుగుకిందికి తీసుకొచ్చిన ప్రముఖ సామాజిక అనుసంధాన వేదిక ఫేస్ బుక్. దీని గురించి చర్చించుకుంటుండగానే ఇప్పుడు పుష్కర కాలంలోకి అడుగుపెట్టింది. అవును ఫేస్ బుక్ కు ఇప్పుడు పన్నేండేళ్లు. 2004 ఫిబ్రవరి 4న మార్గ్ జుకర్ బర్గ్ దీనిని స్థాపించిన అనతి కాలంలోనే అనూహ్యంగా ప్రపంచాన్ని చుట్టేసింది. ప్రస్తుతం ఫేస్‌బుక్ వినిమోగదారుల సంఖ్య చైనా జనాభా కంటే ఎక్కువ. ఇక భారత్‌లో దీని వినియోగదారులు నేటికి 125 మిలియన్లు. ఇది 2016 చివరినాటికి 161 మిలియన్లకు చేరొచ్చని ఒక అంచనా.

2010లో ఫేస్‌బుక్ పై ‘‘ ఏ సోషల్ నెట్‌వర్క్’’ అనే హాలివుడ్ సినిమా విడుదలవగా దీనికి మూడు ఆస్కార్ అవార్డులు కూడా వచ్చాయి. ఇక, 2008లో ప్రపంచంలోనే ఎక్కువ మంది వాడే సోషల్ మీడియాగా ఫేస్‌బుక్ గుర్తింపు పొందింది. ఇందులో మొదట పెట్టుబడిపెట్టింది పేపాల్ కంపెని సహ వ్యవస్థాపకుడు పీటర్ థీల్. ఆయన పెట్టిన పెట్టుబడి మొత్తం 5 లక్షల డాలర్లు. ఇక ఐస్‌లాండ్ దేశమైతే ఏకంగా ఫేస్‌బుక్‌లో వచ్చిన సూచనలు, సలహాలతో తమ రాజ్యాంగంలో మార్పులు చేసుకొంది.

ఇంకో ఆసక్తికరమైన అంశమేమిటంటే ఫేస్‌బుక్‌లోకి లాగిన్ కాకుండానే ఫెస్‌బుక్ యూఆర్‌ఎల్‌తోపాటు 4 అంకెను చేరిస్తే నేరుగా అది ఫేస్‌బుక్ సీఈవో జూకర్ బర్గ్ ప్రోఫైల్ ఓపెన్ చేసి చూపిస్తుంది. ఫేస్‌బుక్ నీలి రంగులో ఉండటానికి కారణం గురించి జూకర్ చెబుతూ తనకు ఎరుపు, ఆకు పచ్చ రంగులు సరిగా కనపడవని, నీలి రంగు మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుందని అందుకే దానిని ఎంచుకున్నట్లు గత ఇంటర్వ్యూలో చెప్పారు. వాట్సాప్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లను ఈ సంస్థే కొనుగోలుచేసింది.

whatsapp channel

మరిన్ని వార్తలు