ప్రాణ భయంతో లక్షమంది పరుగు!

13 May, 2016 10:10 IST|Sakshi
ప్రాణ భయంతో లక్షమంది పరుగు!

డెమాస్కస్: సిరియాలో ఎప్పటి నుంచో అదుపులేకుండా జరుగుతున్న యుద్దం కారణంగా అక్కడి పాలస్తీయునులంతా కూడా ప్రాణభయంతో పరుగులు పెట్టారని, పలు దేశాలకు వలస వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి నివేదిక ఒకటి తెలిపింది.

సిరియాలో యుద్ధ వాతవరణానికి ముందు 5,60,000మంది పాలస్తీనా వాసులు ఉండేదని.. యుద్ధ ప్రారంభం అయ్యాక దాదాపు 1,20,000మంది ప్రాణభయంతో దేశాన్ని విడిచి వెళ్లినట్లు ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఎజెన్సీ ఫర్ పాలస్తీనా రెప్యూజీస్(యూఎన్ఆర్ డబ్ల్యూఏ) వెల్లడిచింది. ఇలా వెళ్లిపోయిన వారిలో 45 వేలమంది లెబనాన్, 15 వేలమంది జోర్డాన్ కు, సగంమందికిపైగా టర్కీ మీదుగా యూరప్ వెళ్లిపోయారని వివరించింది.

>
మరిన్ని వార్తలు