బీజింగ్‌లో 1255 విమానాలు రద్దు

17 Jun, 2020 09:30 IST|Sakshi

బీజింగ్‌ : చైనాలోని బీజింగ్‌లో మరలా క‌రోనా పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. కొంతకాలంగా తగ్గుతూ వస్తున్న కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతూ వస్తుంది. బీజింగ్‌ నగరంలో బుధవారం కొత్తగా 31 కరోనా కేసులు వెలుగుచూడడంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తుగా సుమారు 1255 విమానాల‌ను ర‌ద్దు చేస్తున్నట్లు నగరంలోని రెండు విమానాశ్ర‌యాలు ప్రకటించాయి. దీంతో బీజింగ్‌లో దాదాపు 70 శాతం విమాన రాక‌పోక‌లు నిలిచిపోనున్నాయి. బీజింగ్‌లో తాజాగా ఓ మార్కెట్ నుంచి వైర‌స్ వ్యాప్తి చెందుతున్నట్లు అధికారులు ద్రువీక‌రించారు. దీంతో ప‌బ్లిక్ హెల్త్ ఎమ‌ర్జెన్సీని మూడ‌వ స్థాయి నుంచి రెండ‌వ స్థాయికి ప్ర‌క‌టించారు.(అమరులైన భారత సైనికులకు అమెరికా సంతాపం)

గత 5 రోజుల్లోనే బీజింగ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వంద దాటింది.  ఒక‌వేళ అత్య‌వ‌సం అనుకుంటే త‌ప్ప‌, బీజింగ్ ప్ర‌జ‌లు ఎవ‌రూ తమ ఇండ్లు దాటి బ‌య‌ట‌కు వెళ్ల‌కూడ‌ద‌ని ఆ న‌గ‌ర మున్సిప‌ల్ అధికారి చెన్ బీయి తెలిపారు. ఫెంగ్‌టాయి జిల్లాలో ఉన్న జిన్‌ఫాడి మార్కెట్ నుంచి అత్య‌ధిక సంఖ్య‌లో క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు తెలుస్తోంది. ప్రైమ‌రీ, హైయ‌ర్ స్కూళ్ల విద్యార్థులు క్యాంపస్‌కు రావ‌ద్దు అని ఆదేశించింది. కాలేజీ విద్యార్థులు కూడా క్యాంప‌స్‌కు రావాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. నగరంలోని ప్రజలంతా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది.(వైరల్‌ : భలే గమ్మత్తుగా పోలీస్‌ ట్రైనింగ్‌)


 

మరిన్ని వార్తలు