టిబెట్‌లో బయటపడిన 1200 ఏళ్లనాటి బుద్ధుడి చిత్రాలు

10 Apr, 2018 22:59 IST|Sakshi

బీజింగ్‌: రాతియుగంలో రాళ్లపై రకరకాల చిత్రాలు గీసేవారు. ఆదిమానవులకు సంబంధించిన ఎన్నో విషయాలను ఈ రాతి చిత్రాలే మనకు వెల్లడించాయి. అయితే తాజాగా టిబెట్‌లో బుద్ధుడికి సంబంధించిన పలు రాత్రి చిత్రాలు బయటపడ్డాయట. ఇవి సుమారు 12 వందల సంవత్సరాల కిందటివని శాస్త్రవేత్తలు గుర్తించారు. తూర్పు టిబేట్‌లోని ఒక లోయలో మైనింగ్‌ పనులు జరుగుతుండగా ఈ చిత్రం బయటపడింది. కార్బన్‌ డేటింగ్‌ పద్ధతిలో విశ్లేషించగా.. టిబేట్‌కు చెందిన టుబో పాలన కాలానికి చెందినదిగా నిర్ధారించారు. టుబో సామ్రాజ్యం అప్పట్లో చాలా శక్తిమంతమైనదని, టిబెట్‌ సంస్కృతిని, బౌద్ధమతాన్ని టుబో బాగా ప్రోత్సహించారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.

అయితే  ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ రాతిచిత్రం దాదాపు పది మీటర్ల పొడవు ఉందని, బహుశా ఇది తొమ్మిదో శతాబ్ధానికి చెందినదై ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. రాతిచిత్రం దొరికిన ప్రాంతంలో ప్రస్తుతానికి మైనింగ్‌ పనులను నిలిపివేస్తున్నామని, బయటపడిన రాతి చిత్రాలను భద్రపరిచామని టిబెట్‌ అధికారులు తెలిపారు. కాగా టిబెట్‌లో ఇప్పటిదాకా 5వేలకు పైగా బుద్ధుడి శిల్పాలు, చిత్రాలు బయటపడ్డాయి. ఇవన్నీ వివిధ కాలాలకు చెందినవి కాగా.. ఏడో శతాబ్ధానికి చెందిన శిల్పమే అంత్యంత పురాతనమైదని పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.    

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు