అమెరికాలో కాల్పుల కలకలం; 13 మందికి గాయాలు

22 Dec, 2019 20:46 IST|Sakshi

చికాగో : అమెరికాలోని చికాగోలో ఆదివారం కాల్పులు చోటుచేసుకున్నాయి. ఒక విందు వేడుకలో భాగంగా యువకుల మద్య జరిగిన వివాదం కాల్పులకు దారి తీయడంతో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..చికాగోలో కొందరు యువకులు ఒక ఇంట్లో విందు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వారి మధ్య వివాదం చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా కాల్పులు చోటుచేసుకున్నట్లు ప్యాట్రోల్‌ చీఫ్‌ ఫ్రెడ్‌ వాలర్‌ పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో 13 మంది తీవ్రంగా గాయపడగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటన ఆదివారం ఉదయం 12.30 గంటలకు చోటుచేసుకుందని, బాధితులంతా 16 నుంచి 48 మధ్య వయస్సు వారేనని పేర్కొన్నారు. కాగా, తుపాకీతో కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఫ్రెడ్‌ వాలర్‌ వెల్లడించారు. 


 

మరిన్ని వార్తలు