145 మంది ఇండియన్స్‌ను పంపించేసిన అగ్ర రాజ్యం

20 Nov, 2019 13:26 IST|Sakshi

న్యూఢిల్లీ: అక్రమ వలసదారులపై ట్రంప్‌ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సరైన అనుమతులు లేకుండా తమ దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్నారన్న నెపంతో 145 మంది భారతీయులను వెనక్కు పంపించింది. నేడు వారంతా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఏజెంట్ల ద్వారా అమెరికాలోకి అక్రమంగా చొరబడ్డవారు, వీసా గడువు పూర్తయినా అమెరికాలోనే నివాసముంటున్న భారతీయులు ఈ లిస్టులో ఉన్నారు.

భారతీయులతోపాటు బంగ్లాదేశీయులను, దక్షిణా ఆసియావాసులను కూడా అమెరికా తమ దేశం నుంచి వెళ్లగొట్టింది. ఇదిలా ఉండగా అక్రమ వలసదారుల్లో 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్నవారే అధికమని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ ఏజెంట్లు అక్రమంగా అమెరికాకు పంపించడానికి ఒక్కో వ్యక్తి దగ్గరనుంచి రూ.10 నుంచి రూ.15 లక్షలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అక్టోబర్‌లో 23న ఇదే తరహాలో అమెరికా 117 మంది భారతీయులను వెనక్కు పంపిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు