వెస్ట్రన్ మ్యూజిక్ విన్నాడని.. నరికేశారు!

18 Feb, 2016 17:40 IST|Sakshi
వెస్ట్రన్ మ్యూజిక్ విన్నాడని.. నరికేశారు!

కేవలం పాశ్చాత్య సంగీతం విన్నందుకు ఓ టీనేజి కుర్రాడి తలను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అడ్డంగా నరికేశారు. ఈ దారుణ ఘటన ఇరాక్‌లో చోటుచేసుకుంది. అయామ్ హుస్సేన్ (15) అనే ఈ యువకుడు మోసుల్ పట్టణంలో తన తండ్రితో కలిసి షాపింగ్ మాల్‌లో ఉన్నప్పుడు ఓ పోర్టబుల్ సీడీ ప్లేయర్‌లో పాప్ సంగీతాన్ని వింటుండగా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అతడిని 'అరెస్టు' చేశారు. ఇస్లామిస్ట్ కోర్టులో అతడిని ప్రవేశపెట్టగా, అతడికి బహిరంగ మరణశిక్ష విధించాలని అక్కడ తీర్పు ఇచ్చారు. దాంతో నడిరోడ్డు మీద అతడిని నరికేసి.. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

కేవలం పాప్ సంగీతం విన్నందుకే ఇలా చేయడంతో.. స్థానికుల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. పైగా పాశ్చాత్య సంగీతం వినకూడదని షరియా కోర్టు ఎప్పుడూ చెప్పలేదని కూడా అంటున్నారు. కానీ కార్లు, పార్టీలు, దుకాణాలలో బహిరంగంగా సంగీతం, పాటలు వినడం.. షాపుల్లో ఫొటోలు దిగడం లాంటి వాటిని నిషేధిస్తున్నట్లు రెండేళ్ల క్రితం ఐఎస్ఐఎస్ ప్రకటించింది.

మరిన్ని వార్తలు