యాపిల్‌ను భయపెట్టిన 16 ఏళ్ల బాలుడు!

19 Aug, 2018 12:30 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సిడ్నీ: యాపిల్‌ సంస్థలో పనిచేయాలనే కోరిక ఓ 16 ఏళ్ల బాలుడిని ఆ సంస్థ కంప్యూటర్లను హ్యాక్‌ చేసేలా చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన ఈ టీనేజర్‌ యాపిల్‌ కంపెనీ కంప్యూటర్లను హ్యాక్‌ చేసి ఆ సంస్థను భయపెట్టాడు. అయితే చివరకు దొరికొపోయి శిక్షను అనుభవించేందుకు సిద్దమయ్యాడు. ఇక వినియోగదారుల సమాచారానికి ఎలాంటి నష్టం కలిగించలేదని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. 

మెల్‌బోర్న్‌లోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థి అయిన ఈ టీనేజర్‌ యాపిల్ సంస్థకు వీరాభిమాని. అందులో పనిచేయాలని కలలుగన్నాడు. యూఎస్‌లోని కాలిఫోర్నియాలో ఉన్న ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలోని కంప్యూటర్లను హ్యాక్ చేశాడు. అందులో భద్రపర్చిన 90 జీబీ ఫైళ్లను కూడా డౌన్‌లోడ్ చేశాడు. ఏడాదిలో పలుమార్లు ఇలా కంప్యూటరైజ్‌డ్‌ టన్నెల్స్‌ అండ్‌ ఆన్‌లైన్‌ బైపాసింగ్‌ సిస్టం ద్వారా కంప్యూటర్లను హ్యాక్ చేశాడు. దీన్ని గుర్తించిన సంస్థ ప్రతినిధులు ఆ యువకుడిపై ఎఫ్‌బీఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఆస్ట్రేలియా పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఇంట్లో తనిఖీలు చేసి ఈ మొత్తం సమాచారాన్ని ‘హాకీ హాక్ హాక్’ పేరుతో ఫోల్డర్‌ను క్రియేట్‌ చేసి దాచినట్టు తెలిసింది. నిందితుడు నేరాన్ని అంగీకరించడంతో.. వచ్చేనెల న్యాయస్థానం శిక్ష విధించనుంది. మైనర్‌ కావడంతో అతని పేరును భయట పెట్టలేదు.

>
మరిన్ని వార్తలు