కరోనాకు బలైన మరో పిన్న వయస్కురాలు 

27 Mar, 2020 18:54 IST|Sakshi
మృతురాలు జూలీ(ఫైల్‌)

పారిస్‌ : కరోనా వైరస్‌ బారిన పడి మృతి చెందిందో 16 ఏళ్ల బాలిక. కరోనా కారణంగా అతి చిన్న వయస్కురాలు మృతి చెందటం ఫ్రాన్స్‌లో ఇదే ప్రథమం​. వివరాల్లోకి వెళితే.. పారిస్‌కు చెందిన జూలీకి వారం క్రితం కరోనా సోకింది. చిన్నపాటి దగ్గుతో లక్షణాలు మొదలయ్యాయి. కొద్దిరోజుల తర్వాత దగ్గుతో పాటు విపరీతమైన కఫం కూడా ఉండటంతో కుటుంబసభ్యులు బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స చేయటం ప్రారంభించారు. (కరోనా లాక్‌డౌన్‌: అల్లు అర్జున్‌ ఫోటో వైరల్‌)

అయితే ఊపిరితిత్తులు పూర్తిగా పాడవటంతో గత బుధవారం జూలీ మృతి చెందింది. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకపోయినప్పటికి బాలిక మృతి చెందడం గమనార్హం. కాగా, కొద్దిరోజుల క్రితం పనామాకు చెందిన ఓ 13 ఏళ్ల బాలిక కరోనా వైరస్‌ కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. దక్షిణ అమెరికాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ బాలిక గత ఆదివారం కన్నుమూసింది. 

మరిన్ని వార్తలు