మక్కాలో తొక్కిసలాట

2 Jul, 2016 18:07 IST|Sakshi

రియాద్: ముస్లింల పవిత్ర ప్రదేశం మక్కాలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇందులో 18 మందికి గాయాలయినట్టు ఆదేశ పత్రిక అల్ రియాద్ వెల్లడించింది. రంజాన్ మాసం చివరి శుక్రవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరళిరావడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లకుండానే వైద్యం అందించినట్టు ఆ దేశ మీడియా వెల్లడించింది.

గతేడాది మక్కాలో జరిగిన తొక్కిసలాటలో రెండు వేలకు పైగా యాత్రికులు మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటోంది. ప్రపంచం నలుమూలల నుంచి  ఏటా లక్షలాదిమంది ముస్లింలు  మక్కాను  సందర్శిస్తుంటారు.
 

మరిన్ని వార్తలు