24 గంటల్లో 19 దేశాలు..

2 Nov, 2014 01:05 IST|Sakshi
24 గంటల్లో 19 దేశాలు..

వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా.. వీరు ముగ్గురు అది సాధించి చూపారు. 24 గంటల్లో 19 దేశాలు తిరిగొచ్చేశారు. తద్వారా ప్రపంచ రికార్డును సాధించారు. ఈ టూర్‌కు ఉన్న నిబంధనలు మూడే. ఒకటి.. ప్రతి దేశంలో కాలుమోపాలి, రెండు.. 24 గంటల వ్యవధిలో అన్ని దేశాలను తిరిగిరావాలి, మూడు.. తిరిగామన్న దానికి మీడియాపరమైన ఆధారం ఉండాలి.

ఈ రికార్డు సాధన  కోసం నార్వేకు చెందిన గున్నార్ గార్‌ఫోర్స్, టే యంగ్, ఓస్టీన్‌లు సెప్టెంబర్ 22న అర్ధరాత్రి గ్రీస్ నుంచి బయలుదేరారు. వాయవ్య మార్గంలో ప్రయాణిస్తూ 24 గంటల వ్యవధిలో బల్గేరియా, మెసడోనియా, కొసోవో, సెర్బియా, క్రొయేషియా, బోస్నియా, స్లొవేనియా, ఆస్ట్రియా, హంగేరి, స్లొవాకియా, చెక్ రిపబ్లిక్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, లక్సెంబర్గ్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, లీక్టన్‌స్టైన్ దేశాలు తిరిగొచ్చేశారు. వాతావరణం అనుకూలించలేదట.. లేకుంటే ఇటలీలోనూ అడుగుపెట్టేసి.. 24 గంటల్లో 20 దేశాలు తిరిగొచ్చేసేవాళ్లమని వీరు చెబుతున్నారు.

మెసడోనియా నుంచి సెర్బియాకు వెళ్లడానికి.. ఆస్ట్రియా నుంచి జర్మనీకి వెళ్లడానికి వీళ్లు విమానమెక్కారు. మిగతా ప్రయాణమంతా అద్దె కార్లలోనే సాగించారు. ఖానాపీనా అంతా కార్లలోనే.. కొన్నిసార్లు మూత్రానికి వెళ్లే టైమ్ కూడా దొరికేది కాదట. దాంతో బాటిల్స్‌లోనే కానిచ్చేసేవారట! మొత్తానికి ఏదైతేనేం.. ప్రపంచ రికార్డును(గత రికార్డు 17 దేశాలు) బద్దలుకొట్టేశారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫైనల్లో పరాజితులు లేరు 

పోయిందే.. ఇట్స్‌గాన్‌..

పెట్‌ యువర్‌ స్ట్రెస్‌ అవే!

హత్య చేసి.. శవంపై అత్యాచారం

అమెరికా, రష్యాల మధ్య నూతన ఒప్పందం

విడాకులు కోరినందుకు భార్యను...

పర్యాటకులకు కొద్దిదూరంలోనే విమానం ల్యాండింగ్‌!

ప్రేయసి గొంతుకోసి ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో..

ప్రైమ్‌ డే సేల్ ‌: అమెజాన్‌కు షాక్‌

ఎయిరిండియాకు భారీ ఊరట

ప్రాచీన పిరమిడ్‌ సందర్శనకు అనుమతి

యాంగ్‌ యాంగ్‌ బీభత్సం.. ఎగిరెగిరి తన్నుతూ..

హఫీజ్‌ సయీద్‌కు బెయిల్‌

ఇటలీ టమోటాలకు నెత్తుటి మరకలు

వదలని వాన.. 43 మంది మృతి..!

బుర్ర తక్కువ మనిషి; అయినా పర్లేదు..!

ఫేస్‌బుక్‌కు రూ.34 వేల కోట్ల జరిమానా!

అక్రమ వలసదార్ల అరెస్టులు షురూ

సోమాలియాలో ఉగ్రదాడి

మొసలిని మింగిన కొండచిలువ!

స్త్రీల లోదుస్తులు దొంగిలించి.. ఆ తర్వాత...

కుక్క మాంసం తినొద్దు ప్లీజ్‌!

డర్టీ కారు పార్క్‌ చేస్తే రూ. 9 వేలు ఫైన్‌!

ఫేస్‌బుక్‌కు 500 కోట్ల డాలర్ల జరిమానా!

రెచ్చిపోయిన ఉగ్రమూకలు; 10 మంది మృతి!

పెళ్లికి ఇదేమీ ‘ఆహ్వానం’ బాబోయ్‌!

విమానంలో ఎగిరిపడ్డ ప్రయాణికులు

టర్కీ చేరిన రష్యా ఎస్‌–400 క్షిపణులు

దారిద్య్రం నుంచి విముక్తి చెందారు

యుద్ధవిమానాలు పోతేనే గగనతలం తెరుస్తాం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!