టెక్సాస్లో కాల్పులు

17 Sep, 2016 11:02 IST|Sakshi
టెక్సాస్లో కాల్పులు

టెక్సాస్: టెక్సాస్లో మరోసారి గన్ పేలింది. గుర్తు తెలియని వ్యక్తులు పోలీసు అధికారులపై కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు అధికారులు గాయాలుపాలయ్యారు. అయితే ప్రాణాపాయం తప్పింది. ఓ ఆత్మహత్య ఘటనా స్థలి వద్దకు వెళ్లిన పోలీసులపై ఈ కాల్పులు జరిగాయి. టెక్సాస్ పోలీసు ఉన్నతాధికారులు చెప్పిన ప్రకారం.. ఫోర్ట్ వర్త్ లోని ఓ ఇంట్లో ఆత్మహత్యకు సంబంధించిన సమాచారం అందింది.

దీంతో ఇద్దరు పోలీసు అధికారులు ఆ ఇంటికి వెళ్లగా అందులో ఓ వ్యక్తి తలకు బుల్లెట్ గాయాలతో ఎలాంటి స్పందన లేకుండా పడిపోయి ఉన్నాడు. అక్కడే ఉన్న ఓ షెడ్ దగ్గర తమకు ఆధారాలు లభించవచ్చని వెళ్లిన పోలీసులు షెడ్ షెటర్ పైకెత్తగానే కాల్పులు జరిగాయి. ప్రతిగా పోలీసులు కాల్పులు జరిపారు.

మరిన్ని వార్తలు