బహమాస్‌లో హరికేన్‌ విధ్వంసం

6 Sep, 2019 01:29 IST|Sakshi
హరికేన్‌ ధాటికి పూర్తిగా నేలమట్టమైన మార్ష్‌ హార్బర్‌లోని ఇళ్లు

దాదాపు 20 మంది మృతి

అమెరికాను తాకిన హరికేన్‌

నసావు (బహమాస్‌): డోరియన్‌ హరికేన్‌ గురువారం అమెరికా తూర్పు తీరాన్ని తాకింది. దీని ప్రభావం వల్ల బలమైన ఈదురుగాలతో కూడిన వర్షం పడుతుండటంతో బహమాస్‌లో విధ్వంసం సృష్టించి దాదాపు 20 మంది ప్రాణాలను బలిగొంది. ఆ తర్వాత ఇది అమెరికా తూర్పు తీరం వైపు కదిలింది. హరికేన్‌ ధాటికి దక్షిణ కరోలినా తీరంలో ఉన్న చార్లెస్టన్‌లోని దిగువ ప్రాంతాలు నీట మునిగాయి. మోకాలు లోతు వరకు వరద నీరు ప్రవహిస్తుండటంతో చిన్న చిన్న పడవల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు.  

185 కిలోమీటర్ల వేగంతో గాలులు..
కేటగిరీ 3 హరికేన్‌ చార్లెస్టన్‌కు ఆగ్నేయంగా 130 కిలోమీటర్ల దూరంలో ఈ తుపాన్‌ ఉందని నేషనల్‌ హరికేన్‌ సెంటర్‌ తెలిపింది. ఉత్తరం వైపు కదులుతున్న ఈ తుపాన్‌ కారణంగా గంటకు 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వెల్లడించింది. దీంతో కరోలినా, జార్జియా రాష్ట్రాలతోపాటు హరికేన్‌ ప్రభావిత ప్రాంతాల్లోని లక్షలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు ఆదేశాలిచ్చారు. వందల సంఖ్యల్లోని ఇళ్లపై కప్పులు ఎగిరిపోవడంతోపాటు కార్లు మునిగిపోయాయన్నారు.
 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

>
మరిన్ని వార్తలు