24 గంటల్లో వంద మరణాలు.. 2వేల కరోనా కేసులు

15 Mar, 2020 20:36 IST|Sakshi

స్పెయిన్‌ను వణికిస్తున్న కరోనా వైరస్‌

మాడ్రిడ్‌ : స్పెయిన్‌లో కరోనా వైరస్‌ తీవ్ర భయాందోళనలు సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో కోవిడ్‌ కారణంగా రికార్డు స్థాయిలో 100 మంది మృతి చెందగా.. 2వేల కొత్త కేసులు నమోదు అయ్యాయి. కాగా ఇప్పటివరకు స్పెయిన్‌లో 7753 కేసులు నమోదు కాగా.. 288 మంది మృత్యువాత పడ్డారు. దీంతో స్పెయిన్‌ ప్రభుత్వ  మరింత అప్రమత్తమైంది. దేశంలో కోవిడ్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఇప్పటికే అనేక చర్యలు చేప్పటింది. అనేక కార్యాలయాలను మూసివేసింది. ప్రయాణాలను రద్దు చేసేకోవాలని దేశ ప్రజలకు సూచించింది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.  ఇటలీలో కరోనా మృతుల సంఖ్య 1400కు చేరింది. భారత్‌లోకూ కోవిడ్‌ కేసులు ఆదివారం నాటికి 108కి చేరుకున్నాయి. (కరోనా ఎఫెక్ట్‌ : వణుకుతున్న మహారాష్ట్ర)

మరిన్ని వార్తలు