మరోసారి విఫలమైన మయాన్‌ క్యాలెండర్‌

22 Jun, 2020 09:05 IST|Sakshi

న్యూఢిల్లీ: డూమ్స్‌డే ప్రవచనాలు, మయాన్‌ క్యాలెండర్‌ ప్రకారం జూన్ 21, 2020 నాటికి ప్రపంచం అంతమైపోతుందని కొంతమంది సిద్దాంతకర్తలు పేర్కొడనంతో అది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అదేరోజు అమావాస్య, సూర్యగ్రహణం కూడా రావడంతో ఇది నిజమే అయ్యింటుందని భావించి ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు.  నిన్న(ఆదివారం)‌ 2020  జూన్ 21 ముగియడంతో అదంతా ఉత్తుత్తిదే అని తెలీంది. అయితే ఈ ఏడాది 2020లో విజృంభిస్తున్న కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ప్రజలకు సోకి.. లక్షల్లో మరణించడంతో మయాన్‌ క్యాలెండర్‌ ప్రకారం ఈ ఏడాది ప్రపంచం అంతమైపోతుందని సిద్దాంతకర్తలు అంచనా వేశారు. ఇంతకుముందు కూడా మయాన్‌ క్యాలెండర్‌ ప్రకారం 2012లో ప్రపంచం ముగియనుందంటూ పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. అయితే జూన్ 21 ముగియడంతో 2012 మాదిరిగానే మాయాన్‌ క్యాలెండర్‌  అంతా అబద్ధమేనని మరోసారి రుజువైంది. (2012 కాదు, 2020లో యుగాంతం!)

ఈ మాయాన్‌ క్యాలెండర్ అనేది 1582 సంవత్సరంలో ఉనికిలోకి వచ్చింది. అయితే దీనికి ముందు తేదీలను కనుగొనడానికి వివిధ క్యాలెండర్‌లను ఉపయోగించాల్సి వచ్చిందని సిద్దాంతకర్తలు తెలిపారు. అయితే ఆ సమయంలో ప్రజలు ఎక్కువగా మయాన్‌, జూలియన్‌ క్యాలెండర్‌లను అనుసంరించేవారని  సమాచారం. ప్రస్తుతం ప్రపంచ దేశ ప్రజలు ఎక్కువగా గ్రెగోరియన్‌ క్యాలెండర్‌నే అనుసరిస్తున్నారు. ఈ వింతైన సిద్ధాంతం ప్రకారం జూలియన్ క్యాలెండర్ మరో క్యాలెండర్‌కు మార్చబడుతున్న సమయంలో ఈ క్యాలెండర్ నుంచి సంవత్సరంలోని 11 రోజులు పోయాయాని నిపుణులు పేర్కొన్నారు. ఈ తర్వాత రోజులు ఆ రోజులు జతచేయబడ్డాయి. కానీ దీని ప్రకారం ప్రస్తుతం మనం 2020లో కాకుండా 2012లో ఉన్నామని నిపుణులు చెబుతున్నారు. (తూచ్‌.. యుగాంతం ఉత్తదే!)

దీని గురించి పాలో తగలోగుయిన్ అనే శాస్త్రవేత్త ఈ సిద్దాంతాన్ని సోషల్ మీడియాలో వివరిస్తూ... ‘జూలియన్ క్యాలెండర్ ప్రకారం ప్రస్తుతం మనం సాంకేతికంగా 2012లో ఉన్నాము. గ్రెగోరియన్ క్యాలెండర్లోకి మారడం వల్ల సంవత్సరంలో  కోల్పోయిన 11 రోజులను కొల్పోయాం. గ్రెగోరియన్ క్యాలెండర్ బట్టి  (1752-2020) సార్లు 11 రోజులు = 2,948 రోజులు ఉపయోగించి 268 సంవత్సరాలు. 2,948 రోజులు / 365 రోజులు (సంవత్సరానికి) = 8 సంవత్సరాలు’ అని చెప్పుకొచ్చాడు. కాగా ఈ సిద్ధాంతం ప్రకారం ప్రస్తుతం మనం జూన్ 21, 2020 అనేది కి డిసెంబర్ 21, 2012 అవుతుంది. దీంతో కొంతమంది సిద్ధాంతకర్తలు 2012 డిసెంబర్ 21ని ప్రపంచ అంతంగా ప్రతిపాదించారు. .

మరిన్ని వార్తలు