చైనా యాప్స్‌ నిషేధించండి

17 Jul, 2020 02:49 IST|Sakshi

ట్రంప్‌ను కోరిన అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు

వాషింగ్టన్‌: జాతీయ భద్రత దృష్ట్యా, చైనాకు సంబంధించిన 60 యాప్స్‌పై నిషేధం విధించి భారత్‌ అసాధారణ చర్యకు పూనుకుందని, ఇదే మాదిరిగా అమెరికాలో సైతం టిక్‌టాక్‌ తదితర చైనా యాప్‌లను నిషేధించాలని 24 మంది కాంగ్రెస్‌ రిపబ్లికన్‌ సభ్యుల బృందం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను కోరింది. చైనా కమ్యూనిస్టు పార్టీతో సంబంధం ఉన్న టిక్‌ టాక్, ఇతర సామాజిక మాధ్యమాలను అమెరికా మార్కెట్లోకి ప్రవేశించకుండా నిరోధించాలని కోరుతూ చట్టసభ సభ్యులు ట్రంప్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

సైబర్‌ సెక్యూరిటీ చట్టాలను బట్టి, టిక్‌టాక్‌ మాతృ సంస్థ బైట్‌డాన్స్‌తో సహా చైనా కంపెనీలు సామాజిక మాధ్యమాల వినియోగదారుల డేటాను అధికార  కమ్యూనిస్టు పార్టీకి ఇవ్వాల్సి ఉంటుందని, ఇది అమెరికా జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు అని లేఖలో పేర్కొన్నారు.  దీనిపై ప్రభుత్వం వారం రోజుల్లోగా నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని వైట్‌హౌస్‌ అధికారి  మీడియాకు వెల్లడించారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు