నేపాల్లో భూకంపం; 42 మంది మృతి

12 May, 2015 19:09 IST|Sakshi

కఠ్మాండు: భూకంప ప్రభావానికి మరుభూమిగా మారిన నేపాల్ కోలుకోముందే మరోసారి భూప్రకంపనలు ఆ దేశాన్ని వణికించాయి. మంగళవారం సంభవించిన భూకంపం ధాటికి నేపాల్లో భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఇప్పటి వరకు 42 మంది చనిపోయినట్టు వార్తలు రాగా, మరో 400 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. నేపాల్లోని గుర్ఖా ప్రాంతంలో 90 శాతం వరకు భవనాలు కుప్పకూలాయి.

భూకంప కేంద్రం కఠ్మాండుకు 170 కిలో మీటర్ల దూరంలో ఉన్నట్టు గుర్తించారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3 గా నమోదైంది. కఠ్మాండుతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఇక ఉత్తర, ఈశాన్య భారతదేశంపైనా దీని ప్రభావం చూపించింది. బీహార్లో 16 మంది, ఉత్తరప్రదేశ్లో ఒకరు మరణించారు. ఆంధ్రప్రదేశ్ లోనూ పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. కాగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.
 

(తొలి రిపోర్టు: నేపాల్ లో ఏడుగురు, భారత్ లో 12 మంది మృతి)

మరిన్ని వార్తలు