బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు : ముగ్గురు మృతి

20 Jan, 2016 14:21 IST|Sakshi
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు : ముగ్గురు మృతి

బీజింగ్ : తూర్పు చైనా జింయాగ్జి ప్రావిన్స్లోని కున్షాన్ గ్రామంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. హంగ్షెంగ్ బాణాసంచా ఫ్యాక్టరీకి చెందిన వర్క్షాపులో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా...  మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు అత్యవసర నిర్వహణ కార్యాలయం బుధవారం వెల్లడించింది. ఈ ఘటనలో గాయపడిన పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపింది.

ఈ ప్రమాద సమయంలో సదరు పరిసర ప్రాంతాల్లో దాదాపు వెయ్యి మంది ప్రజలు ఉన్నారని... వారందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అత్యవసర నిర్వహణ కార్యాలయం పేర్కొంది. మరో 21 మందిని ఈ ప్రమాదం నుంచి రక్షించినట్లు తెలిపింది. ఒకరి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదని చెప్పింది.

ఈ పేలుళ్ల దాటికి పరిసర ప్రాంతాల్లోని ఇళ్లుకు బీటలు ఏర్పడ్డాయని పేర్కొంది. ఈ ప్రమాదంపై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. దాదాపు 300 ఏళ్లుగా యంగ్కొ టౌన్షిప్లో బాణాసంచా తయారీ చేస్తున్న విషయం విదితమే. ఈ ప్రాంతంలో దాదాపు 31 బాణాసంచా తయారు చేసే ఫ్యాక్టరీలు ఉన్నాయి.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు