‘మద్యం’ మరణాలు ఏటా 30 లక్షలు

22 Sep, 2018 05:47 IST|Sakshi

జెనీవా: ప్రపంచవ్యాప్తంగా ఏటా సంభవించే ప్రతి ఇరవై మరణాల్లో ఒక దానికి మద్యమే కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. మద్యం వ్యసనపరులు లివర్‌ సిర్రోసిస్, క్యాన్సర్‌ వంటి 200 రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 2016 గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా మద్యంతో సంబంధమున్న 30 లక్షల మరణాలు సంభవించాయి. మొత్తం మరణాల్లో ఇది 5.3 శాతం. ఇదే సమయంలో ఎయిడ్స్‌తో 1.8 శాతం, రోడ్డు ప్రమాదాల్లో 2.5 శాతం, హింస కారణంగా 0.8శాతం మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 230 కోట్ల మందికి మద్యం అలవాటు ఉంది. యూరప్‌తోపాటు ఆసియాలోని భారత్, చైనాల్లో ఆల్కహాల్‌ వినియోగంలో గణనీయ పెరుగుదల నమోదవుతోంది. 

మరిన్ని వార్తలు