విషపు కోరల్లో 30 కోట్ల మంది బాలలు

1 Nov, 2016 01:07 IST|Sakshi

వాషింగ్టన్: విషవాయువులు బాల్యాన్ని కబ ళిస్తున్నాయి. మానసిక, శారీరక ఎదుగుదల ను దె బ్బతీస్తున్నాయి. ఐక్యరాజ్య సమితికి చెందిన యూనిసెఫ్  తాజా నివేదిక ప్రకారం..  ప్రపంచవ్యాప్తం గా 30 కోట్ల మంది బాలలు విష వాయువులు పీలుస్తున్నారు. ప్రతి ఏడుగురు బాలల్లో ఒకరు కాలుష్య వాయువు పీలుస్తున్నారు. నిర్దేశిత అంతర్జాతీయ ప్రమాణాల కంటే ఆరు రెట్లు అది ప్రమాదకరం.

ప్రతి ఐదేళ్లల్లో 6 లక్షల మంది బాలలు వాతావరణ కాలుష్యానికి బలవుతున్నారు. వాహన ఉద్గారాలు, ఇంధనం, దుమ్ము, వ్యర్థ పదార్థాల కాల్చివేత వల్ల ఉత్పన్నమయ్యే కాలుష్యం బాలల పాలిట శాపంగా మారిందని యూనిసెఫ్ ప్రతినిధి ఆంథోనీ లేక్  తెలిపారు. ఈ  పరిస్థితి దక్షిణాసియాలో దారుణం గా ఉందర్కొన్నారు. ఈ నెల 7-18 మధ్య మొరాకోలో జరిగే ఐరాస వార్షిక వాతావరణం- మార్పులపై చర్చల నేపథ్యంలో  నివేదిక విడుదల చేశారు. 

మరిన్ని వార్తలు