అఫ్ఘానిస్థాన్లో 36 మంది తాలిబన్ల కాల్చివేత

21 Oct, 2013 13:53 IST|Sakshi

అఫ్ఘానిస్థాన్లో భద్రత దళాలు మరోసారి ఉగ్రవాదులపై పైచేయి సాధించాయి. ఆదివారం నుంచి కనీసం 36 మంది ఉగ్రవాదుల్ని కాల్చిచంపినట్టు ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ సోమవారం తెలియజేసింది.
 
'హెల్మాండ్, పక్టియా, వార్డక్, కాంధహార్, బాఘ్లాన్, కునార్ రాష్ట్రాల్లో అఫ్ఘాన్ జాతీయ భద్రత దళాలు, నాటో సారథ్యంలోని దళాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. 36 మంది సాయుధ తాలిబన్లు హతమయ్యారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడగా, 15 మందిని అరెస్ట్ చేశారు' అని అఫ్ఘాన్ జాతీయ భద్రత దళాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు