11 గంటల్లో త్రీడీ బస్సు తయార్..!

18 Jun, 2016 03:49 IST|Sakshi
11 గంటల్లో త్రీడీ బస్సు తయార్..!

ఇక్కడ కనిపిస్తున్న మినీబస్సు పేరు ‘ఒల్లి’. అమెరికాలోని వాషింగ్టన్‌లో గురువారం నుంచి రోడ్డుపై కెక్కింది. ఈ బస్సును కేవలం 11 గంటల్లో తయారు చేయవచ్చు! విద్యుత్తుతో పనిచేస్తుంది కాబట్టి మోటర్‌ను తెచ్చుకుంటే చాలు.. మిగిలిన పనంతా త్రీడీ ప్రింటర్ చూసుకుంటుంది. కేవలం పది గంటల్లో ఈ మినీ బస్సుకు అవసరమైన   అన్ని భాగాలను ప్రింట్ చేసేసి ఇస్తుంది. గంట టైమ్‌లో ఈ విడిభాగాలన్నింటినీ అసెంబ్లింగ్ చేసి బస్సును రోడెక్కించవచ్చట! 12 మంది ప్రయాణించేందుకు వీలున్న ఒల్లీ ఒక సెల్ఫ్ డ్రైవర్ మినీబస్సు.

అంటే డ్రైవర్ ఉండడు. ఐబీఎం అభివృద్ధి చేసిన సూపర్ కంప్యూటర్ ‘వాట్సన్’ పుణ్యమా అని ఒల్లీతో మనం ఫ్రెండ్స్‌తో మాట్లాడినట్లే మాట్లాడొచ్చు... ‘‘మధ్యాహ్నం 3.30కి అబిడ్స్ దగ్గర పికప్ చేసుకో’ అని స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా చెప్పేయవచ్చు. ప్రస్తుతానికి ఇది వాషింగ్టన్ డీసీలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో లాస్‌వెగాస్, మియామీల్లోనూ సేవలు ప్రారంభించవచ్చునని దీని తయారీదారులైన ‘లోకల్ మోటార్స్’ ప్రతినిధులు అంటున్నారు.

>
మరిన్ని వార్తలు