నీటిలో చేపలా..!

15 Mar, 2014 04:44 IST|Sakshi

నీటిలో అచ్చం చేపలాగే ఈదుతూ.. చేపలాగే సెకన్లలో దిశను మార్చుకునే సరికొత్త రోబో చేప ఇది. దీనిలోపల అమర్చిన డబ్బా నుంచి కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేయడం ద్వారా ఇది శరీరాన్ని సున్నితంగా కదిలిస్తూ దిశను మార్చుకుంటుంది. నీటిని తీసుకుని ఇది చేపల మాదిరిగా ఉబ్బిపోగలదు. 3డీ ప్రింటర్ సాయంతో తయారు చేసిన ఈ చేప నీటిలో 30 నిమిషాలు ప్రయాణించగలదు. నిజమైన చేపల గుంపులోకి  పంపించి.. వాటి సహజ ప్రవర్తనను అధ్యయనం చే సేందుకని దీనిని మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు తయారు చేశారు.

మరిన్ని వార్తలు