ఒక్కొక్క‌రికి ఒక్కోలా.. ఎందుకిలా?

8 Jul, 2020 13:06 IST|Sakshi

కొన్ని వ‌స్తువులు, దృశ్యాలు దృష్టికోణాన్ని బ‌ట్టి ఒక్కొక్క‌రికి ఒక్కోలా క‌నిపించొచ్చు. ఒకే ఫోటోలో రెండు ర‌కాలైన అర్థం దాగి ఉండొచ్చు. ప‌రేడోలియా అని పిలిచే అద్భుత దృశ్యాన్ని చూస్తే మ‌న క‌ళ్లు కూడా ఒక్కోసారి మ‌న‌ల్ని మోసం చేస్తున్నాయోమో అనే భావ‌న క‌లుగుతుంది. వాస్త‌వానికి మ‌నం ఎలా అయితే ఆలోచిస్తున్నామో అదే విధంగా చూడ‌గ‌లుగుతాం.

ఉదాహ‌ర‌ణ‌కు బాగా చీక‌టి ప‌డ్డాకా వీధిలో న‌డుస్తుంటే ఎక్క‌డ నుంచి ఓ ముప్పు వ‌స్తుందో అన్న భ‌యం మ‌నకు క‌లుగుతుంది. ఆ స‌మ‌యంలో కొంచెం వంగి ఉన్న చెట్టును చూసినా దాని వ‌ల్ల మ‌న‌కేదైనా జ‌రుగుతుందేమో అన్న భ‌యం క‌ల‌గ‌డం స‌హ‌జం. అయితే ఎక్కువ ఆందోళ‌న చెందిన‌ప్పుడు ప్ర‌తీది పరేడోలియా విజువ‌ల్ లానే క‌నిపిస్తుంది. అంతేకాకుండా దాదాపు 40 శాతం మంది ఈ విజువ‌ల్ వండ‌ర్‌ను ఆస్వాదించార‌ని ప్రొఫెసర్ లీ ఓ ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నారు.
 
అయితే దీన్నో జ‌బ్బులా చూడాల్సిన ప‌నిలేదు. వాస్త‌వానికి ప‌రేడోలియా ఉన్న‌వారు మ‌రింత సృజ‌నాత్మ‌కంగా ఆలోచిస్తారు అని ఇటీవలి అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. లైవ్ సైన్స్ ప్రకారం, మతపరమైన లేదా అతీంద్రియ శ‌క్తుల గురించి బ‌లంగా న‌మ్మేవారు ప్ర‌కృతిని కూడా వాళ్ల వాళ్ల ఆలోచ‌న‌ల‌తోనే చూస్తారు. అంటే భౌతికంగా దాని రూపం వేరైనా వారి ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా దాన్ని మార్చుకుంటారన్నామాట‌. 

మరిన్ని వార్తలు