పేదరికం నిర్మూలనలో దూసుకెళ్తున్న భారత్‌..

27 Jun, 2018 11:58 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతి త్వరగా పేదరికం నుంచి విముక్తి పొందుతున్న దేశంగా భారత్‌ నిలిచింది. ప్రతి నిమిషానికి 44 మంది పేదరికం నుంచి బయటపతున్నారని సర్వే ఒకటి వెల్లడించినట్టు ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ పేర్కొంది. పేదరికం పెరుగుతున్న దేశాలలో నైజీరియా మొదటి స్థానంలో నిలిచిందని, అక్కడ నిమిషానికి ఆరుగురు పేదరికం బారిన పడుతున్నారని బ్రూకింగ్స్‌ నిర్వహించి అధ్యయంలో తేలిందని తెలిపింది. ‘ఫ్యూచర్‌ డెవలప్‌మెంట్‌’ పేరుతో ఈ సర్వే నిర్వహించినట్టు బ్రూకింగ్స్‌ సంస్థ తన బ్లాగ్‌లో పేర్కొంది.

సర్వే ప్రకారం.. మే నెల చివరి నాటికి ఇండియాలో 7.3 కోట్ల మంది పేదరికంతో బాధపడుతున్నారు. కాగా నైజీరియాలో 8.7 కోట్ల మంది పేదరికంలో జీవిస్తున్నారు. అయితే ఇండియాలో ప్రతి నిమిషానికి 44 మంది పేదరికం నుంచి బయటపడుతుండగా, నైజీరియాలో మాత్రం భిన్నంగా ప్రతి నిమిషానికి ఆరు మంది పేదరికం బారిన పడుతున్నారని అని సర్వే పేర్కొంది. 2022 నాటికి ఇండియాలో పేదరికం 3 శాతానికి తగ్గుతుందని, 2030 నాటికి పేదరికం పూర్తిగా తొలగిపోతుందని సర్వే నివేదిక వెల్లడించింది. 

మరిన్ని వార్తలు