అథ్లెట్లకు 4,50,000 కండోమ్ లు ఇస్తారట!

21 May, 2016 21:46 IST|Sakshi
రియో (బ్రెజిల్): ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించనున్న రియో ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో లో ఏకంగా 4,50,000  కండోమ్ లను అందుబాటులో ఉంచనున్నట్టు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) తెలిపింది. 2012 నాటి లండన్ ఒలింపిక్స్ కంటే ఇప్పుడు మూడు రెట్లు అధిక కండోమ్ లను అందుబాటులో ఉంచనున్నట్టు వెల్లడించింది. మొదటిసారిగా 1,00,000 మహిళా కండోమ్ లను అందుబాటు లో ఉంచనున్నట్టు తెలిపింది. ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొననున్న 10,500 మంది క్రీడాకారుల సురక్షిత శృంగారం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐఓసీ పేర్కొంది.

జికా వైరస్ దోమల ద్వారా కాకుండా అరక్షిత శృంగారం వల్ల కూడా వ్యాపించే అవకాశం ఉందని అందుకోసమే కండోమ్ల సరఫరాను పెంచినట్టు వెల్లడించింది.  ఆగస్టు 5న ఒలింపిక్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. జులై 24 నుంచే రియో ఒలంపిక్ క్రీడా గ్రామానికి చేరుకునే క్రీడాకారులకు కండోమ్‌ లను అందుబాటులో ఉంచనున్నట్టు ఐఓసీ వెల్లడించింది. 2000 నాటి సిడ్నీ ఒలింపిక్స్ లో లక్ష నుంచి లక్షన్నర కండోమ్ లను అందుబాటులో ఉంచారు. జికా వైరస్ నిరోధానికి కండోమ్ ల పంపిణీకి ఎటువంటి సంబంధం లేదని, అయినా పెద్దమొత్తంలో ఎందుకు పంపిణీ చేస్తున్నారని బ్రెజిల్ పత్రికలు విమర్శిస్తున్నాయి.
 
మరిన్ని వార్తలు