విమాన శకలాల నుంచి మృతదేహాల వెలికితీత

21 Dec, 2015 07:57 IST|Sakshi

ఆర్చర్డ్స్ బేకర్ ఫీల్డ్: అమెరికా కాలిఫోర్నియాలోని శాన్ జోస్ నుంచి లాస్ వెగాస్ కు బయలుదేరిన చిన్నతరహా విమానం అనూహ్యంగా కుప్పకూలిన సంఘటనలో విమాన శకలాల నుంచి ఐదు మృతదేహాలు వెలికితీశారు.


బయలుదేరిన కొద్దిసేపటికే మధ్య కాలిఫోర్నియాలోని ఆర్చర్డ్స్ బేకర్ ఫీల్డ్ ప్రాంతంలో విమానం కూలిపోయిందని, శనివారం రాత్రి ఈ సంఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు. ప్రతికూల వాతావరణం వల్లే ప్రమాదం సంభవించి ఉంటుందని ఫెడరల్ ఏవియేషన్ అధికారులు పేర్కొన్నారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేయనున్నమని తెలిపారు.

>
మరిన్ని వార్తలు