'వీడియో క్లిప్' తో అడ్డంగా దొరికిపోయిన సైనికులు

7 Aug, 2015 07:22 IST|Sakshi
'వీడియో క్లిప్' తో అడ్డంగా దొరికిపోయిన సైనికులు

గ్వాటెమలా సిటీ: ఇద్దరు మైనర్ ను హింసాయుతంగా వేధిస్తున్నట్లు దృశ్యాలు నమోదయిన వీడియో క్లిప్ ఐదుగురు సైనికుల తొలగింపునకు కారణమైంది. గ్వాటెమలా సైన్యానికి చెందిన ఐదుగురు జవాన్లు ఇద్దరు కుర్రాళ్లను తుపాకి మడమలతో కొట్టడం, చెంపదెబ్బలు, కిక్లు, పంచ్లు విసరడం, గోడకుర్చీ వేయించడం లాంటి దృశ్యాలన్నీ ఆ విడయోలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన గ్వాటెమలా సైన్యాధికారులు సదరు సైనికుల్ని గురువారం సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించారు.

జులై 26న సాన్ పెర్డో యెపోకాప అనే ప్రాంతలో అతిగా మద్యం సేవించిన టీనేజర్లు..  సమీపంలో ఉండే ఓ కాలనీ వాసులతో గలాటాకు దిగి రచ్చ చేశారని, వారిని నివారించే క్రమంలో సైనికులు కాస్త కటవుగా వ్యవహరించాల్సి వచ్చిందని ఆర్మీ ప్రతినిధులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ మైనర్లను కొట్టడం అభ్యంతరకరమే కనుక వారిపై తప్పలేదనీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు